ఎప్పుడు ఒప్పుకోవద్దు రా ఓటమి...
ఎప్పుడు ఒప్పుకోవద్దు రా ఓటమి...
ఎప్పుడు ఒడులుకోవద్దు రా ఓరిమి..
విశ్రమించ వద్దు ఏ క్షణం.. విస్మరించవద్దు నిర్ణయం..
అప్పుడే నీ జయం నిశ్చయం రా.. ఎప్పుడు ఒప్పుకోవద్దు రా ఓటమి..
నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వా పిల్ల రెక్క ముందు తక్కువేనురా..

సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేను రా..
పశ్చిమాన పొంచి వుండి రవిని మింగు అసుర సంధ్య ఒకా నాడు నెగ్గలేదు రా..
గుటక పడని అగ్గి వుండ సాగరాలనీదుకుంటు తూరుపింట తేలుతుంది రా..
నిషా విలాసమెంత సేపు రా.. ఉషోదయాన్ని ఎవ్వడాపు రా ..
రగులుతున్న గుండె కూడా సూర్య గోళ మంటిదేను రా.. ఎప్పుడూ..
ఒప్పుకోవద్దు రా ఓటమి..
నొప్పిలేని నిముషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా..

నీరసించి నిలిచిపోతె నిముషమైన నీది కాదు .. బ్రతుకు అంటే నిత్య ఘర్షణ..
దేహముంది.. ప్రాణముంది.. నెత్తురుంది.. సత్తువుంది.. ఇంత కన్న సైన్యముండునా..

ఆస నీకు అస్త్ర మౌను .. శ్వాస నీకు శాస్త్ర మౌను ఆసయమ్ము సారథౌను రా..
నిరంతరం ప్రయత్నమున్నదా.. నిరంతరం ప్రయత్నమున్నదా..
నిరాశకే నిరాశ పుట్టదా.. నిరాశకే నిరాశ పుట్టదా..
ఆయువంటు వున్న వరకు చావు కూడ నెగ్గ లేక శవము పైనే గెలుపు చాటురా..
ఎప్పుడు ఒప్పుకోవద్దు రా ఓటమి... ఎప్పుడు ఒప్పుకోవద్దు రా ఓటమి...

No comments:
Post a Comment